te.m.wikipedia.org అన్న చిరునామాకి వెళ్ళడం ద్వారా ప్రస్తుతం తెలుగును చూపించే
మొబైళ్ళలో తెలుగు వికీపీడియాని చూడవచ్చు. అయితే, మొబైలు కోసం మొదటి పేజీని
అమర్చుకోలేదంటూ ఒక గమనిక కనబడుతుంది. ప్రస్తుతం మొబైలు తెవికీలో వెతవచ్చు (కానీ
మొబైళ్ళలో తెలుగులో టైపు చెయ్యలేము కదా) మరియు యాదృచ్ఛిక పేజీ లంకె ద్వారా
పేజీలను చూడవచ్చు.

మొబైలు కొరకు మొదటి పేజీలో కొంత విషయం ఉండేలా చూస్తే బావుంటుంది. ఇందుకోసం
మొబైలు కోసం మొదటి పేజీని తయారు చేసుకోవాలి. దాన్ని నేను మొదలుపెట్టాను.
ప్రస్తుతం మొదటి పేజీలోని ఈ వారపు వ్యాసం, మీకు తెలుసా?, చరిత్రలో ఈ రోజు అన్న
విభాగాలను చేర్చాను. మామూలు మొదటి పేజీలో వీటిని మార్చగానే మొబైలు పేజీలోనూ
తాజా అవుతాయి. మొబైలు మొదటిపేజీని ప్రత్యేకంగా మార్చాల్సిన పనిలేదు.
తయారీలో ఉన్న మొబైలు మొదటి
పేజి<http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80_%28%E0%B0%AE%E0%B1%8A%E0%B0%AC%E0%B1%88%E0%B0%B2%E0%B1%81%29>.
మొబైళ్ళ ద్వారా దీన్ని చూడాలంటే ప్రస్తుతం ఈ లంకెకి వెళ్ళాలి:
te.m.wikipedia.org/wiki/WP:MOBILE. మీ తెలుగు చూపించే మొబైళ్ళలో దీన్ని
ప్రయత్నించి చూడండి; మీ సూచనలనూ సలహాలనూ తెలియజేయండి. (సరే అంటే దీన్ని మొబైలు
మొదటి పేజీగా చేయమని బగ్‌జిల్లాలో అభ్యర్థిద్దాం. ఆ తర్వాత నేరుగా *
te.m.wikipedia.org* కి వెళితే, ఈ పేజీ మొదటి పేజీగా కనిపిస్తుంది.)

ఇట్లు,
వీవెన్.
_______________________________________________
WikiTe-L mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l

Reply via email to