ఈ బగ్గు <https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=28652>ని ఇప్పుడు
పరిష్కరించారు! కనుక ఇకనుండి te.m.wikipedia.org కి వెళితే కాస్త విషయం
కనబడుతుంది.

22 ఏప్రిల్ 2011 2:26 ఉ న, Veeven (వీవెన్) <[email protected]> ఇలా రాసారు :

> te.m.wikipedia.org అన్న చిరునామాకి వెళ్ళడం ద్వారా ప్రస్తుతం తెలుగును
> చూపించే మొబైళ్ళలో తెలుగు వికీపీడియాని చూడవచ్చు. అయితే, మొబైలు కోసం మొదటి
> పేజీని అమర్చుకోలేదంటూ ఒక గమనిక కనబడుతుంది. ప్రస్తుతం మొబైలు తెవికీలో
> వెతవచ్చు (కానీ మొబైళ్ళలో తెలుగులో టైపు చెయ్యలేము కదా) మరియు యాదృచ్ఛిక పేజీ
> లంకె ద్వారా పేజీలను చూడవచ్చు.
>
> మొబైలు కొరకు మొదటి పేజీలో కొంత విషయం ఉండేలా చూస్తే బావుంటుంది. ఇందుకోసం
> మొబైలు కోసం మొదటి పేజీని తయారు చేసుకోవాలి. దాన్ని నేను మొదలుపెట్టాను.
> ప్రస్తుతం మొదటి పేజీలోని ఈ వారపు వ్యాసం, మీకు తెలుసా?, చరిత్రలో ఈ రోజు అన్న
> విభాగాలను చేర్చాను. మామూలు మొదటి పేజీలో వీటిని మార్చగానే మొబైలు పేజీలోనూ
> తాజా అవుతాయి. మొబైలు మొదటిపేజీని ప్రత్యేకంగా మార్చాల్సిన పనిలేదు.
> తయారీలో ఉన్న మొబైలు మొదటి 
> పేజి<http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80_%28%E0%B0%AE%E0%B1%8A%E0%B0%AC%E0%B1%88%E0%B0%B2%E0%B1%81%29>.
> మొబైళ్ళ ద్వారా దీన్ని చూడాలంటే ప్రస్తుతం ఈ లంకెకి వెళ్ళాలి:
> te.m.wikipedia.org/wiki/WP:MOBILE. మీ తెలుగు చూపించే మొబైళ్ళలో దీన్ని
> ప్రయత్నించి చూడండి; మీ సూచనలనూ సలహాలనూ తెలియజేయండి. (సరే అంటే దీన్ని మొబైలు
> మొదటి పేజీగా చేయమని బగ్‌జిల్లాలో అభ్యర్థిద్దాం. ఆ తర్వాత నేరుగా *
> te.m.wikipedia.org* కి వెళితే, ఈ పేజీ మొదటి పేజీగా కనిపిస్తుంది.)
>
> ఇట్లు,
> వీవెన్.
>



-- 
Read Telugu blogs @ koodali.org
_______________________________________________
WikiTe-L mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l

Reply via email to