నమస్తే,

వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/నాలుగవ స్కైప్ సమావేశం
నివేదిక<https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AC%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%95/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B0%B5_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%88%E0%B0%AA%E0%B1%8D_%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95>ప్రకారం
ప్రతిపాదనల గడువు 16 డిసెంబరు గా పొడిగించడానికి మండలి నిర్ణయించింది.
సముదాయం ప్రతిపాదనలను
కొలబద్ద<https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AC%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%95/%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6>ఆధారంగా
తగిన వివరణలతో పరిపుష్టం చేయవలసినదిగా మరియు ఇంకా అర్హులైన వారిని
ప్రతిపాదించి, వారి అంగీకారం కొరకు ప్రయత్నించవలసిందిగా సముదాయాన్ని
కోరుతున్నది. అలాగే కొలబద్దని మెరుగుచేయటానికి ఏమైనాసూచనలుంటే వారంరోజులలోగా
చర్చాపేజీలో తెలియచేయమని కోరుతున్నది.

అర్జున


4 డిసెంబర్ 2013 8:05 AM న, తెలుగు వీర <[email protected]> ఇలా రాసారు :

> తెలుగు నెజ్జనులందరికీ నమస్కారాలు,
>
> వచ్చేవారం తెలుగు వికీపీడియా పదో పుట్టినరోజు. ఈ శుభ సందర్భంగా తెలుగు
> వికీజనులందరూ కలిసి పండగ చేసుకోవాలని నిశ్చయించడమైనది. ఈ ఉత్సవాలను
> నిర్వహించడానికి తెవికీ నిర్వాహకుడు, వికీపీడియా అభివృద్ధి ఎంతగానో తోడ్పడిన
> బి.కె.విశ్వనాధ్ గారు అధ్యక్షుడిగా ఒక ఉత్సవ నిర్వహణా సంఘం ఏర్పడింది. ఈ
> సంఘానికి ప్రణయ్‌రాజ్ గారు కార్యదర్శిగానూ, పలివెల కశ్యప్ గారు కోశాధికారి
> గానూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వీరితో పాటు తెలుగు వికీమీడియా భారత పర్వం
> యొక్క నాయకుడు రహ్మానుద్దీన్ గారు, సి.ఐ.ఎస్-ఏ2కె కార్యనిర్దేశకుడు
> విష్ణువర్ధన్ గారు కూడా ఈ సంఘంలో సభ్యులు. అలాగే పదేళ్ళ తెలుగు మీడియావికీ
> ప్రస్థానంలో విశేషకృషి చేసిన వారిని గుర్తించి, సత్కరించేందుకు ఒక పురస్కార
> ఎంపిక సంఘం కూడా ఏర్పడింది. దానికి నేను అధ్యక్షత వహిస్తుండగా, వికీమీడియా
> భారత చాప్టర్ సహ-స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు అర్జునరావు గారు కార్యదర్శి
> ఎన్నికయ్యారు. ఈ పురస్కార సంఘంలో డా. రాజశేఖర్ గారు, టి.సుజాత గారు మరియు
> పూర్వ వికీమీడియా భారత చాప్టరు యొక్క బెంగుళూరు ప్రతినిధి అయిన ఏ.రాధాకృష్ణ
> గారు కూడా ఈ ఎంపిక సంఘంలో సభ్యులు.
>
> ఈ పురస్కారానికి తెలుగు భాషలో తొట్టతొలి (బహుశా భారతీయ భాషలలోనే తొట్టతొలి)
> ఆధునిక విజ్ఞానసర్వస్వపు కృషికి శ్రీకారం చుట్టిన శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు
> గారి పేరు మీదగా కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం అనే పేరు ఎంపిక
> చేయబడింది. 1912-1913 ప్రాంతంలో విజ్ఞానసర్వస్వపు కృషిని ప్రారంభించిన
> కొమర్రాజు లక్ష్మణరావు, ఆ కృషిని ప్రారంభించి వంద సంవత్సరాలు నిండటం కూడా ఒక
> విశేషం. ఇలా తెలుగు వికీకి పదేళ్ళు నిండటం, లక్ష్మణరావు గారి
> విజ్ఞానసర్వస్వానికి వందేళ్ళు ఒకేసారి నిండటం గొప్ప విశేషం. ఈ విధంగా తెలుగు
> మీడియావికీ ప్రాజెక్టులలో కృషిచేసిన వారిని తలచుకొని వారి సేవలను
> గుర్తిస్తున్న తరుణంలో కొమర్రాజు లక్ష్మణరావు గారి కృషిని కూడా
> స్మరించుకోవటానికి చక్కని అవకాశం. ఈ పురస్కారంలో భాగంగా ఒక్కొక్క గ్రహీతకు ఒక
> ప్రశంసా పత్రంతో పాటు, పదివేల నగదు బహుమతి కూడా ఇవ్వబడుతుంది. పరస్పర
> వైరుధ్యాసక్తులకు తావు లేకుండా, ఉత్సవాల నిర్వహణా సంఘం సభ్యులు మరియు
> పురస్కారాల ఎంపిక సంఘం సభ్యులు ఈ పురస్కారాలు అందుకోవటానికి అనర్హులుగా
> ప్రకటించడమైనది.
>
> ఈ పురస్కారాలకు అర్హులైన సభ్యులకై ప్రతిపాదనలు[2] ఆహ్వనిస్తున్నాము.
> ప్రతిపాదనలు దాఖలు చేయవలసిన గడువు డిసెంబరు 9, 2013 సమయం 23:59
> (గ్రీ.ప్రా.కా). వికీమీడియా కృషి చేసిన సభ్యులెవరైనా ఈ పురస్కారాలకు తమ పేరును
> స్వయంగా ప్రతిపాదించుకోవచ్చు లేదా ఇతరులచే ప్రతిపాదించబడవచ్చు. ఎంపిక సంఘం
> అన్ని ప్రతిపాదనలను పరిశీలించి పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది.
> ప్రతిపాదనా పద్ధతిని 2011 NWRలో అప్పటి కార్యనిర్వహణా సంఘం అధ్యక్షుడు
> అరుణ్‌రాం రూపొందించి, అమలుపరచిన ప్రతిపాదనా పద్ధతిని[3] మరింత మెరుగుపరచి
> అర్జున గారు రూపొందించారు. నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వటం భారతీయ వికీల్లో
> ఇదే ప్రథమం. ఇప్పటికి వరకు ఉన్న ప్రోత్సాహకాలతో ఇది మరింత మంది క్రియాశీలక
> సభ్యులను, కొత్తసభ్యులను ఉత్సాహపరుస్తుందని ఆశిస్తున్నాం. సభాముఖంగా మీరు ఈ
> పురస్కారాలకు అర్హులనీ భావించిన సభ్యులను పురస్కారానికై ప్రతిపాదించాలని
> కోరుతున్నాను.
>
> అంతేకాక ఈ శుభసమయంలో మా ప్రయత్నం జయప్రదం అయ్యేందుకు మీరు ఆశీస్సులు
> కోరుతున్నాము. ముందు ముందు తెవికీలో జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు
> పంచుకొనే ప్రయత్నం చేస్తాము.
>
> భవదీయుడు,
>
> రవి వైజాసత్య,
>
> తెలుగు వికీపీడియా సంపాదకుడు.
>
> మూలాలు
> 1. తెలుగు వికీలో కొమర్రాజు లక్ష్మణరావు పేజీ https://te.wikipedia.org/wiki/
> కొమర్రాజు_వెంకట_లక్ష్మణరావు
>
> 2. పురస్కార వివరాలు, నియమ నిబంధనలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP
>
> 3.  ప్రతిపాదనల పేజీ
> https://te.wikipedia.org/wiki/Wikipedia:Komarraju_LakshmanaRao_Wikimedia_Award_Proposals
>
>  --
> --
> "తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
> ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, [email protected] కు మెయిలు పంపండి.
> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, [email protected] కు
> మెయిలు పంపండి.
> మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును
> http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి
> ---
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగువికీ" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to [email protected].
> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>
_______________________________________________
WikiTe-L mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l

Reply via email to