ధన్యవాదాలు
On Sunday, 29 December 2013 12:59 PM, Arjuna Rao Chavala <[email protected]> wrote: ---------- ఫార్వర్డ్ చేసిన సందేశం ---------- పంపినవారు: తెలుగు వీర <[email protected]> తేది: 29 డిసెంబర్ 2013 11:58 AM సబ్జెక్టు: [తెలుగువికీ] కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార ఫలితాలు వీరికి: [email protected], [email protected] తెలుగు నెజ్జనులందరికీ మళ్లీ నమస్కారాలు, తెలుగు వికీపీడియా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రారంభించబడిన కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కారానికి[1] వచ్చిన ప్రతిపాదనలను[2] ఎంపిక మండలి పరిశీలించడం పూర్తి అయ్యింది. ముందుగా ప్రతిపాదిత సభ్యులకు, ఆయా ప్రతిపాదనలను ప్రారంభించి, మద్దతు ఇచ్చి, విస్తరించి ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొన్న తెలుగు వికీ సభ్యులందరికీ మరియు మీ తోడ్పాటుకి ధన్యవాదాలు. ఈ పురస్కారానికి 28 ప్రతిపాదనలు రాగా వాటిలో 18కి ప్రతిపాదిత సభ్యులు అంగీకారం తెలిపారు.ఈ పురస్కారపు తొలివిడతగా ఈ సంవత్సరం, గత దశాబ్ది కాలంలో చేసిన కృషిని గుర్తిస్తూ పది పురస్కారాలు ఇవ్వాలని ఎంపిక మండలి నిర్ణయించింది. దీనికి ఎంపికైన అభ్యర్ధులు, మూల్యాంకన వరుసక్రమంలో *చదువరి,ఎం.ప్రదీప్, చావా కిరణ్, వీవెన్, పాలగిరి, రవిచంద్ర,అహ్మద్ నిసార్, శశి,జె.వి.ఆర్.కె.ప్రసాద్,మరియు భాస్కర నాయుడు*. వీరికి దశాబ్ది ఉత్సవాలలో నగదు బహుమతి మరియు పురస్కారము ఇవ్వబడుతుంది. వీరి చిత్రాలు, పురస్కార ప్రధానాంశాలు తెలుగు మరియు ఆంగ్లములో [3] చూడవచ్చు. కృషి గణాంకాలు మరియు వికీ అభివృద్ధికి దోహదపడిన గుణాత్మక అంశాల విశ్లేషణ[4] మరియు మూల్యాంకనం [5] కూడా చూడవచ్చు. అంగీకారం తెలపని ప్రతిపాదిత సభ్యులు మరియు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పడిన ఇతర సభ్యుల కృషిని గుర్తిస్తూ ఎంపిక మండలి ప్రశంసాపత్రమివ్వాలని నిర్ణయించింది. దీనికి ఎంపికైన మొత్తము 30 సభ్యుల వివరాలు[6] చూడవచ్చు. వీరికి ప్రశంసా పతకం (ఎలెక్ట్రానిక్) త్వరలో వారివాడుకరి చర్చాపేజీలలో ఇవ్వబడుతుంది. ఈ పురస్కారాలను రూపకల్పన దిశ నుండి దాదాపు వేయి గంటల సమయాన్ని వెచ్చించిన ఎంపిక సంఘం సభ్యులు, అర్జునరావు,రాజశేఖర్, రాధాకృష్ణ మరియు సుజాతగార్లకు నా కృతజ్ఞతలు. ఈ పురస్కారాలను రూపకల్పన చేసి, ఎంపిక సంఘం కార్యదర్శిగా కార్యభారాన్నంతా చాలా మటుకు మోసిన అర్జునరావు గారికి ప్రత్యేకకృతజ్ఞతలు. పురస్కారాలకై కావలసిన నిధులు సమకూర్చడానికి అంగీకరించిన తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యనిర్వాహక వర్గానికి[7] ధన్యవాదాలు. వైజాసత్య కొలరావిపు ఎంపిక మండలి అధ్యక్షుడు 1. పురస్కార వివరాలు, నియమ నిబంధనలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP 2. ప్రతిపాదనల పేజీ https://te.wikipedia.org/wiki/Wikipedia:Komarraju_LakshmanaRao_Wikimedia_Award_Proposals 3. పురస్కార విజేతల వివరాలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Winners 4. ప్రతిపాదన అంగీకరించిన సభ్యుల కృషి గణాంకాలు మరియు అభివృద్ధికి దోహదపడిన అంశాల విశ్లేషణ https://te.wikipedia.org/wiki/File:KLRWP-2013_Applicants_work_Statistics_and_Factors_Aiding_Growth.pdf 5.మూల్యాంకనం https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Scoring 6. ఎంపిక మండలి ప్రశంసాపత్ర విజేతల వివరాలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Jury_Appreciation_Winners 7. తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యనిర్వాహక వర్గం https://te.wikipedia.org/wiki/WP:TEWIKI10/Committee -- -- "తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది. ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, [email protected] కు మెయిలు పంపండి. ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, [email protected] కు మెయిలు పంపండి. మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి --- You received this message because you are subscribed to the Google Groups "తెలుగువికీ" group. To unsubscribe from this group and stop receiving emails from it, send an email to [email protected]. For more options, visit https://groups.google.com/groups/opt_out. _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
