అందరికీ, *తెవికీలో మీరు తెలుగులో టైపు చెయ్యడానికి అక్కడ లభించే పద్ధతిని ఉపయోగిస్తుంటే, ఈ సందేశం మీ కోసమే. తప్పక చదవండి.*
ఇప్పుడు తెవికీలో అప్రమేయంగా (డీఫాల్టుగా) ఒక టైపింగు పద్ధతి ఉంది. అయితే, దాన్ని తీసివేయబోతున్నారు. దాని స్థానంలో అన్ని వికీపీడియాలలోనూ ప్రామాణికంగా పనిచేసే విధానాన్ని తెస్తున్నారు. మీరు ఏం చేయాలంటే: *** *ఈ లంకె<https://translatewiki.net/w/i.php?title=User:Veeven/%E0%B0%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86&action=edit&uselang=te>కు వెళ్ళి ఎడిట్ పెట్టెలో తెలుగు టైపు చేసి చూడండి.* *** RTS పద్ధతిలో మీరు తెలుగుని టైపు చెయ్యవచ్చు. పరీక్షించి చూసి తప్పులనూ, దోషాలనూ తెలియజేయండి. అందరూ పరీక్షించి చూసి సరే అంటే దీన్ని మరో వారంలో తెవికీ మరియు ఇతర తెలుగు వికీ ప్రాజెక్టులలో అమలులోనికి తేవచ్చు. మరింత సమాచారం కోసం ఈ క్రింద చదవండి. ప్రస్తుత పద్ధతిని తీసివేయాలనుకోడానికి ఇవీ కారణాలు: 1. ఇప్పుడున్న పద్ధతి అంత సంపూర్ణం కాదు. 2. తతిమా సోదర ప్రాజెక్టులలో లేదు. కొన్ని చోట్ల సరిగా పనిచేయట్లేదు. 3. మీడియావికీ 1.19 సంచికలో జావాస్క్రిప్టుకి సంబంధించి మార్పులు చాలా ఉన్నాయి. ఈ పద్ధతి పనిచేయకపోవచ్చు కూడా. 4. ఇతర స్థానిక వికీపీడియాల్లో ఇలాంటి పద్ధతులు అమలులో ఉన్నాయి. వీటన్నింటి (సాంకేతికంగా అమలుచేసిన విధానం, పనిచేసే పద్ధతుల) మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఇలాంటి స్థానిక పరిష్కారాలను ఏకీకృతం/ప్రామాణికం చేస్తూ, వివిధ భాషలలో టంకనాన్ని (టైపింగుని) సాధ్యం చేస్తూ సాంకేతికంగా ఒకే విధమైన పద్ధతిని అవలంబించే *నరయం* <http://www.mediawiki.org/wiki/Extension:Narayam> అనే మీడియావికీ పొడగింతను ఫౌండేషన్ తయారుచేస్తుంది. తెలుగుకి సంబంధించినంత వరకూ ప్రస్తుతం InScript మరియు RTS (లిప్యంతరీకరణ) మీటల మ్యాపింగులను నేను అందించాను. ఈ కొత్త పరికరం ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీ సైటులో పరీక్షకు ఉంది. మీకు ఆ సైటులో ఖాతా ఉంటే, పరీక్షించి చూడండి. లేదా పైన నేను ఇచ్చిన లంకెలోనైనా పరీక్షించవచ్చు. ఈ కొత్త పద్ధతిని వాడి చూసి దీనిలోని లోపాలను, తప్పులను కనిపెట్టి తెలియజేయవలసిందిగా మనవి. దీనిపై మీకు సందేహాలూ ప్రశ్నలూ ఉంటే అడగడానికి వెనుకాడకండి. అన్నట్టు, అన్ని వికీ సోదర ప్రాజెక్టుల లోనూ తెలుగు టైపింగు పద్ధతులను స్థిరీకరించాలి అన్నది తెవికీ 2012 లక్ష్యాల<http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:2012_%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81>లో ఒకటి. ఇట్లు, వీవెన్. _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
