ఇది నిజంగా సులభంగా ఉంది. వికీ పనులు కాస్త వేగంగా చేయొచ్చు. థాంక్స్ వీవెన్.
2012/2/23 Veeven <[email protected]> > అందరికీ, > > *తెవికీలో మీరు తెలుగులో టైపు చెయ్యడానికి అక్కడ లభించే పద్ధతిని > ఉపయోగిస్తుంటే, ఈ సందేశం మీ కోసమే. తప్పక చదవండి.* > > ఇప్పుడు తెవికీలో అప్రమేయంగా (డీఫాల్టుగా) ఒక టైపింగు పద్ధతి ఉంది. అయితే, > దాన్ని తీసివేయబోతున్నారు. దాని స్థానంలో అన్ని వికీపీడియాలలోనూ ప్రామాణికంగా > పనిచేసే విధానాన్ని తెస్తున్నారు. మీరు ఏం చేయాలంటే: > > *** *ఈ > లంకె<https://translatewiki.net/w/i.php?title=User:Veeven/%E0%B0%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86&action=edit&uselang=te>కు > వెళ్ళి ఎడిట్ పెట్టెలో తెలుగు టైపు చేసి చూడండి.* *** > > RTS పద్ధతిలో మీరు తెలుగుని టైపు చెయ్యవచ్చు. పరీక్షించి చూసి తప్పులనూ, > దోషాలనూ తెలియజేయండి. అందరూ పరీక్షించి చూసి సరే అంటే దీన్ని మరో వారంలో > తెవికీ మరియు ఇతర తెలుగు వికీ ప్రాజెక్టులలో అమలులోనికి తేవచ్చు. > > మరింత సమాచారం కోసం ఈ క్రింద చదవండి. > > ప్రస్తుత పద్ధతిని తీసివేయాలనుకోడానికి ఇవీ కారణాలు: > > 1. ఇప్పుడున్న పద్ధతి అంత సంపూర్ణం కాదు. > 2. తతిమా సోదర ప్రాజెక్టులలో లేదు. కొన్ని చోట్ల సరిగా పనిచేయట్లేదు. > 3. మీడియావికీ 1.19 సంచికలో జావాస్క్రిప్టుకి సంబంధించి మార్పులు చాలా > ఉన్నాయి. ఈ పద్ధతి పనిచేయకపోవచ్చు కూడా. > 4. ఇతర స్థానిక వికీపీడియాల్లో ఇలాంటి పద్ధతులు అమలులో ఉన్నాయి. వీటన్నింటి > (సాంకేతికంగా అమలుచేసిన విధానం, పనిచేసే పద్ధతుల) మధ్య చాలా తేడాలు ఉన్నాయి. > > ఇలాంటి స్థానిక పరిష్కారాలను ఏకీకృతం/ప్రామాణికం చేస్తూ, వివిధ భాషలలో > టంకనాన్ని (టైపింగుని) సాధ్యం చేస్తూ సాంకేతికంగా ఒకే విధమైన పద్ధతిని > అవలంబించే *నరయం* <http://www.mediawiki.org/wiki/Extension:Narayam> అనే > మీడియావికీ పొడగింతను ఫౌండేషన్ తయారుచేస్తుంది. తెలుగుకి సంబంధించినంత వరకూ > ప్రస్తుతం InScript మరియు RTS (లిప్యంతరీకరణ) మీటల మ్యాపింగులను నేను > అందించాను. > > ఈ కొత్త పరికరం ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీ సైటులో పరీక్షకు ఉంది. మీకు ఆ > సైటులో ఖాతా ఉంటే, పరీక్షించి చూడండి. లేదా పైన నేను ఇచ్చిన లంకెలోనైనా > పరీక్షించవచ్చు. ఈ కొత్త పద్ధతిని వాడి చూసి దీనిలోని లోపాలను, తప్పులను > కనిపెట్టి తెలియజేయవలసిందిగా మనవి. > > దీనిపై మీకు సందేహాలూ ప్రశ్నలూ ఉంటే అడగడానికి వెనుకాడకండి. > > అన్నట్టు, అన్ని వికీ సోదర ప్రాజెక్టుల లోనూ తెలుగు టైపింగు పద్ధతులను > స్థిరీకరించాలి అన్నది తెవికీ 2012 > లక్ష్యాల<http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:2012_%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81>లో > ఒకటి. > > ఇట్లు, > వీవెన్. > > > -- > "తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది. > ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, [email protected] కు మెయిలు పంపండి. > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, [email protected] కు > మెయిలు పంపండి. > మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును > http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
